పంగిడి లోభూకుంభకోణం

Published: Wednesday April 22, 2020
ఐ.పంగిడి, దేచర్ల గ్రామంలో 70 లక్షల రూపాయల భూకుంభకోణం.............. ఐ.పంగిడి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం 9 ఎకరాల భూమిని ;దేచర్ల గ్రామంలో 1 1/2 ఎకరాల భూమిని ప్రభుత్వం వారు కొనుగోలు చేయడం జరిగింది .ఇళ్ల స్థలాలకోసం భూమి ఇచ్చిన రైతులకు ఎకరానికి 33 లక్షల నుండి 35 లక్షలు చొప్పున వారివారి అకౌంట్లలో ప్రభుత్వం వారు జమ చేశారు .ఐపంగిడి గ్రామంలో వైఎస్సార్ పార్టీ నాయకులు రైతులను బెదిరించి ,ప్రభుత్వం వారు ఎకరానికి 29 లక్షలు మాత్రమే రేటు నిర్ణయిస్తే మినిస్టర్ గారితో మాట్లాడి ఆ రేటును మేము 35 లక్షల వరకు పెరిగేలా కృషి చేశామని అందువలన ఆ 29 లక్షల రూపాయలు పోను.... మిగతా ఆరు లక్షలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు .బ్యాంక్ విత్ డ్రా ఫారాలపై సంతకాలు చేయించుకుంటున్నారు .దేచర్ల గ్రామంలో ఒక ఎకరాకు 24 లక్షలు చొప్పున ధర ప్రభుత్వం నిర్ణయించిందని, దానిని 35 లక్షల వరకూ మినిస్టర్ గారి ద్వారా పెరిగేలా కృషి చేశామని ,అందువలన ఎకరానికి 11 లక్షల చొప్పున తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు రైతులు మొరపెట్టుకుంటున్నారు .ఐ.పంగిడి గ్రామంలో 9 ఎకరాలకు ఎకరా ఒక్కింటికి 6 లక్షల చొప్పున 54 లక్షలు ,దేచర్ల గ్రామం లో ఒకటిన్నర ఎకరాలకి ఎకరా ఒక్కింటికి 11 లక్షల చొప్పున 16 లక్షల 50 వేల రూపాయలు మొత్తం కలిపి రైతుల వద్ద నుండి పంగిడి వైసిపి వ్యక్తులు 70 లక్షల 50 వేల రూపాయలు కొట్టేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు .ఆ సొమ్మును మినిస్టర్ గారికి, రెవిన్యూ డిపార్ట్మెంట్ వారికి చెల్లించాలని వెంటనే సదరు సొమ్మును ఇవ్వాలని, లేకుంటే మీ అంతు చూస్తామని బెదిరిస్తున్నట్టుగా భూములిచ్చిన రైతులు వాపోతున్నారు . " నిజం నిప్పులాంటిది".... వాస్తవాలు ఎప్పటికైనా బయటపడతాయి. వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఆ పార్టీని అడ్డంపెట్టుకుని లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్న చీడపురుగులను ఏరిపారేయకపోతే వై.యస్.ఆర్ పార్టీ దెబ్బ తింటుంది. మినిస్టర్ గారికి, డిపార్ట్మెంట్ వారికి చెడ్డ పేరు వస్తుంది .వైయస్.ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,శ్రేయోభిలాషులు ఈ విషయం పై దృష్టి పెట్టి పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలని మనవి చేస్తున్నాము.భూములు ఇచ్చిన రైతులెవరూ పంగిడి వైసిపివ్యక్తుల బెదిరింపులకు లొంగవద్దు. వారికి ఒక్క పైసాకూడా ఇవ్వవద్దు..మీకు గ్రామపెద్దలు, జనసేన,బిజెపి నాయకులు అండగా ఉంటామని వాగ్దానం ...