కాకినాడ కు బారి ప్రమాదం పొంచి వుంది.

Published: Sunday April 26, 2020
పేదలకు ఇండ్ల నిర్మాణం ముసుగులో బారి కుట్రే జరుగుతుందా ! కరోనా కట్టడికన్నా రాజకీయ ప్రయోజనాలు కే జగన్ సర్కార్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. పేదల ఇండ్ల పట్టాల ముసుగులో కాకినాడ "మడ" అడవులు ను నరికివేయాలనుకోవటం జగన్ సర్కార్ వైఫల్యానికి తార్కాణం. జగన్ సర్కార్ మెరుగైన పాలనపై దృష్టి సారించకపోతే ఆంధ్రప్రదేశ్ కు మరో విపత్తు తప్పదని, కరోనా కట్టడి పై పాలనా పరమైన దృష్టి సారించకుండా రాజకీయ సొంత ప్రయోజనాలు పై దృష్టి సారించటం ఏపి కి ప్రమాదకర సంకేతాలు. కాకినాడ "మడ"అడవులు సహజ సిద్ధంగా ఏర్పడినవి. తుఫాన్ లకు, విపత్తులకు అడవులు రక్షణ కవచంవలే కాపాడుతున్నాయి.ఇప్పటికే పర్యావరణం లోపించి ఏటా సంభవించు విపత్తు నష్టాలతో ప్రజల జీవనం పక్షి జీవితంగా మారిపోయింది. కాకినాడ మడ అడవులు లాక్ డౌన్ వేళ నరికివేస్తున్నా, అక్కడ స్థానిక ప్రజలుకు జరగబోయే ప్రమాదం తెలిసినా ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్న కారణం వెనుక వైసిపి నేతలు ఏ స్థాయిలో భయపెడుతున్నారో బాహాటంగా కనబడుతుంది. కాకినాడ అత్యధిక శాతం ప్రజలు కష్టాన్ని నమ్ముకుని నిరంతరం శ్రమించేవారి సంఖ్య ఎక్కువ, అదేవిధంగా ఉద్యమ చైతన్యం, ధైర్య సాహసాలు కూడా ఎక్కువేనని చారిత్రిక అనుభవాలు తెలియ చేస్తున్నాయి. అక్కడ రాజకీయ నేతలకు బలహీనతలు వుండొచ్చును ప్రజలకు ఏ బలహీనతలు లేవు అనే గురుతర భాద్యత ఆసన్నమైనది అని, మడ అడవులను, పర్యావరణాన్ని కాకినాడ ప్రజలు రాజకీయాలకు అతీతంగా సంఘటితంగా కాపాడుకోవాలి. ఇండ్ల స్థలాలను బూచిగా చూపి మడ అడవులపై ఏదో వ్యాపార కుట్ర జరుగుతుంది.వైఎస్సార్ ముఖ్యమంత్రి గా వున్న సమయం లో కూడా మడ అడవులను ఆనుకుని తూ గో జిల్లా లో ఒకమంత్రి, పార్లమెంట్ సభ్యుని సహాయంతో పోర్ట్, పిషింగ్ కు సంబందించిన ఒక విదేశి కంపెనీని స్థాపించే కుట్ర జరిగింది. పర్యావరణానికి నష్టం ఏర్పడుతుంది అని , సముద్ర జలాలు తీవ్రం గా కలుషితమయ్యి ప్రజల ఆరోగ్యాలకు పెను ప్రమాదం ఏర్పడుతుందని ఆనాడు కాకినాడ ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించి ఆ కుట్రను భగ్నం చేసారు. సముద్ర జలాలకు ఆనుకుని పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వటం ప్రమాదం అని జగన్ సర్కార్ కు తెలియనిది కాదు.ఖచ్చితంగా ఇండ్ల స్థలాలు వెనుక పెద్ద కుట్రే దాగివుంది. ఇంత బాహాటంగా అడవులు నరికి వేస్తున్నా అటవి శాఖ, ఇరిగేషన్ శాఖ, కేంద్ర పర్యావరణ శాఖ వారు చోద్యం చున్నవైనం వెనుక ముడుపులు చేతులు మారాయి అనే అనుమానాలు కలుగుతున్నాయి. మడ అడవులు సముద్రం కు ఆనుకుని ఇండ్ల స్థలాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెబుతుంది అంటే బ్రతికి వుండగానే సమాధులు కట్టుకోవటం లాంటి చర్యగా భావించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇండ్ల స్థలాల పేరుతొ పెద్ద ఎత్తున అధికారికంగా భూ సేకరణ ప్రభుత్వం చేస్తుందని, ప్రభుత్వానికి చిత్త శుద్ధి వుంటే చట్ట ప్రకారం కన్నా అధికంగా భూమి వున్న వారి నుండి నిజాయితీగా భూ సేకరణ జరిపి పేదలకు ఇండ్ల నిర్మాణం జరపాలి. జగన్ సర్కార్ కు న్యాయస్థానాలు అన్నా, చట్టాలు అన్నా, చట్ట పరమైన పాలన అన్నా కనీస భాద్యత, గౌరవం లేదు అని , కరోనా వైరస్ నియంత్రణ పై పాలనా పరమైన రక్షణ చర్యలకన్నా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవటం ఏపి ప్రజల దురదృష్టం. మడ అడవులును కేంద్ర ప్రభుత్వం కాపాడాలని, పర్యాటకంగా అభివృద్ధి పరచాలని, సంభందిత యంత్రాంగం భవిష్యత్ విపత్తు ప్రమాదాన్ని తెలియచేస్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలను సమర్పించాలని, నిర్లక్ష్యం వహిస్తే కాకినాడ పరిసర ప్రాంతాలకు ప్రమాదం తప్పదు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు కాకినాడ కు పొంచి వున్న ప్రమాదాన్ని గుర్తించి పేదలకు ఇండ్ల నిర్మాణం పేరుతొ జరుగుతున్న కుట్రను అడ్డుకోవాలి. అందుకు రాజకీయ కార్యాచరణకు సిద్ద పడాలని,కాకినాడ ప్రజలు నిర్లక్ష్య ధోరణి వహిస్తే జరిగే ప్రమాధం కరోనా కంటే తీవ్రంగా వుంటుంది.