విజేశ్వరం బెరేజ్ దిగువన కృష్ణ జింకలు

Published: Sunday April 26, 2020
జనావాసాల మధ్యకు జింకలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ అమలు చేయడంతో వన్యప్రాణుల జనావాసాల మధ్యకు వస్తున్నాయి.ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజి దిగువన లంకల్లో ఇసుక తిన్నెల మధ్య మొలిచే చెంగలిదుబ్బిల చిగుళ్ళు తింటూ చెంగు చెంగున గెంతులేసుకుంటూ తిరిగే కృష్ణ జింకలు బయటకు వస్తున్నాయి. ఈ లంకల్లో వందలాది జింకలు ఉన్నాయి. అయితే ఇవి జనాలకు చిక్కకుండా గోదావరి పాయ మధ్యలోనే జీవనం సాగిస్తాయి. కాని జనతాకిడి తగ్గిపోవటంతో బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.శనివారం కడియం మండలం బుర్రిలంక సమీపంలో మూడేళ్ల జింక బయటకు రావడంతో కుక్కలు దాడి చేశాయి.ఇది గమనించిన ఓ రైతు ఆ జింకను కాపాడి కడియం పశువుల ఆసుపత్రికి తీసుకొచ్చారు.డాక్టర్ కల్లూరి సత్యనారాయణ ఆ జింకకు వైద్యం చేయడంతో క్షేమంగా ఉంది.దానిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఇటీవలి ఈ లంకల్లో జింకల సంఖ్య విపరీతంగా పెరగడంతో కొందరు బోట్లుపై లంకల్లోకి విహార యాత్ర పేరుతో వెళ్ళి వాటిని వేటాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఈ జింకల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు.. కొండ్రెడ్డి శ్రీనివాస్. ప్రెస్ రిపోర్టర్.