సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా గోదావరి ఉత్సవం

Published: Saturday January 05, 2019
కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఈనెల 12, 13 వ తేదీల్లో గోదావరి ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ మంత కె ఎస్. జవహర్ అన్నారు.  శుక్రవారం మంత్రి కార్యాలయంలో అధికారులతో గోదావరి ఉత్సవం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు కోట్ల రూ పాయలతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నా మని అధికారులందరూ సమన్వయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. గోదావరి జిల్లాల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా గోదావరి ఉత్సవాన్ని నిర్వహించాలని మంత్రి తెలిపారు. వాటర్ స్పోర్ట్స్, జైంట్ వీల్, ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, ఫుడ్ కోర్ట్స్, ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్, టి నాగేంద్ర కుమార్, విజ్ క్రాఫ్ట్ నిర్వాహకులు, ఎం స్వరూప్ కుమార్ ను మంత్రి ఆదేశించారు. ముగ్గుల పోటీల్లో నెగ్గిన వారికి బహుమతులు ఉంటాయని, పోటీల్లో పాల్గొన్న ఒక్కరికి బహుమతులు ఉంటాయని మంత్రి తెలిపారు. రిస్క్యూ టీములు ఏర్పాటు చేయాలని డి. ఎస్పీని మంత్రి ఆదేశించారు.  మ్యాజిక్ షోలు, మిమిక్రీ ముత్య ప్రదర్శన, డ్రం షోలు, కోలాటాలు, ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. ఐటిడిఏ, కోట రామచంద్రపురం నుంచి కొమ్ము డాన్సులు, ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ రకాల పిండి వంటలు ఏర్పాటు చేయాలన్నా రు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, జె. రాధా రాణి, ఏం సి చైర్మన్, వేగి చిన్న, డి.ఎస్.పి. ఎస్ వెంకటేశ్వరరావు, కొవ్వూరు ఆర్డీవో వై.సత్యనారాయణరావు,  జె. సుబ్బయ్య చౌదరి, ఏ.చక్రధరరావు, పి. శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్, టి. నాగేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.