ఆదరణ పధకం కింద లబ్ది దారులకు పరికరాలను పంపిణీ

Published: Friday December 28, 2018

కొవ్వూరులో ఆదరణ పధకం కింద లబ్ది దారులకు మంత్రి కే ఎస్ జవహర్ పరికరాలను పంపిణి చేశారు . కొవ్వూరు ఎన్టీ ఆర్ ప్రాంగణం లోని చంద్రన్న కళావేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలవారి అభ్యున్నతికి చేస్తున్న కృషిని జవహర్ వివరించారు . అన్నివర్గాల ప్రజలు ఆదాయం పెరగాలని ప్రభుత్వం ఆదరణ పధకం కింద లబ్ది దారులకు పరికరాలను పంపిణీ చేస్తుందని అన్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జె రాధారాణి తదితరులు పాల్గొన్నారు.