ప్రధాన వార్తలు
రాబోయే రోజులు అన్ని డేంజరే

*రాబోయే రోజులు అన్ని డేంజరస్* *గ్రీన్ జోన్* లేదు ... *రెడ్ జోన్* లేదు..... అసలు *ఏ జోన్* లేదు అందరూ వెళ్లేది........ *డేంజర్ జోన్* లోకి..... కాబట్టి అందరు *జాగ్రత్తగా* ఉండాలి.... లాక్‌డౌన్ తొలగిపోయి... మాములుగా వచ్చే రోగాల మాదిరిగా కరోనాతో కలసి జీవించాల్సిన రోజులు* వచ్చేశాయి....‌ మాస్కూలు శానిటైజర్లు వ్వక్తిగత *పరిశుభ్రత* మనిషికి చాలా అవసరమని *కరోనా* మరోసారి రుజువు చేసింది.... ఈ *కరోనా* త్వరగా తగ్గిపోయి ఎవరూ *ఆకలి బాధ* లేకుండా ముందులా అందరూ *సంతోషంగా* ఉండాలని కోరుకుందాం....... మనిషికి *జీవితాంతం* తోడుగా ఎవరు ఉండరు అలా ఉంటారు అనుకోవడం *బ్రమ* మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన *గుండె ధైర్యం* తప్ప మరోకటి లేదు........ *అదృష్టాన్ని* సరదాగా నమ్ముకో *కష్టాన్ని* పూర్తిగా నమ్ముకో *విజయం* నీదే కష్టాలు వచ్చినప్పుడు *కాలాన్ని* తిట్టకు *నాకే ఎందుకు* ఇలా అవుతుందని..... *ఒక్క మాట* గుర్తుంచుకో *కాలం మంచి* ఆటగాడికే పోటీ ఇస్తుంది *కానీ చేత* గాని *చవటలకు* కాదు *ఆడి* చూడు *గెలుపు* చాలా గొప్పగా ఉంటుంది...... *వంద* బిందెలతో *నీళ్లు* పోసి నంత మాత్రాన *చెట్టు* అమాంతం *కాయలు* కాయదు అలాగే *మనం* ఎక్కువ కష్టపడుతున్నాం *కదా* అని పనులన్నీ *క్షణాల్లో* పూర్తవ్వవు దేనికైనా *సమయం* రావాలి *సహనం* కావాలి..........

కాకినాడ కు బారి ప్రమాదం పొంచి వుంది.

పేదలకు ఇండ్ల నిర్మాణం ముసుగులో బారి కుట్రే జరుగుతుందా ! కరోనా కట్టడికన్నా రాజకీయ ప్రయోజనాలు కే జగన్ సర్కార్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. పేదల ఇండ్ల పట్టాల ముసుగులో కాకినాడ "మడ" అడవులు ను నరికివేయాలనుకోవటం జగన్ సర్కార్ వైఫల్యానికి తార్కాణం. జగన్ సర్కార్ మెరుగైన పాలనపై దృష్టి సారించకపోతే ఆంధ్రప్రదేశ్ కు మరో విపత్తు తప్పదని, కరోనా కట్టడి పై పాలనా పరమైన దృష్టి సారించకుండా రాజకీయ సొంత ప్రయోజనాలు పై దృష్టి సారించటం ఏపి కి ప్రమాదకర సంకేతాలు. కాకినాడ "మడ"అడవులు సహజ సిద్ధంగా ఏర్పడినవి. తుఫాన్ లకు, విపత్తులకు అడవులు రక్షణ కవచంవలే కాపాడుతున్నాయి.ఇప్పటికే పర్యావరణం లోపించి ఏటా సంభవించు విపత్తు నష్టాలతో ప్రజల జీవనం పక్షి జీవితంగా మారిపోయింది. కాకినాడ మడ అడవులు లాక్ డౌన్ వేళ నరికివేస్తున్నా, అక్కడ స్థానిక ప్రజలుకు జరగబోయే ప్రమాదం తెలిసినా ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్న కారణం వెనుక వైసిపి నేతలు ఏ స్థాయిలో భయపెడుతున్నారో బాహాటంగా కనబడుతుంది. కాకినాడ అత్యధిక శాతం ప్రజలు కష్టాన్ని నమ్ముకుని నిరంతరం శ్రమించేవారి సంఖ్య ఎక్కువ, అదేవిధంగా ఉద్యమ చైతన్యం, ధైర్య సాహసాలు కూడా ఎక్కువేనని చారిత్రిక అనుభవాలు తెలియ చేస్తున్నాయి. అక్కడ రాజకీయ నేతలకు బలహీనతలు వుండొచ్చును ప్రజలకు ఏ బలహీనతలు లేవు అనే గురుతర భాద్యత ఆసన్నమైనది అని, మడ అడవులను, పర్యావరణాన్ని కాకినాడ ప్రజలు రాజకీయాలకు అతీతంగా సంఘటితంగా కాపాడుకోవాలి. ఇండ్ల స్థలాలను బూచిగా చూపి మడ అడవులపై ఏదో వ్యాపార కుట్ర జరుగుతుంది.వైఎస్సార్ ముఖ్యమంత్రి గా వున్న సమయం లో కూడా మడ అడవులను ఆనుకుని తూ గో జిల్లా లో ఒకమంత్రి, పార్లమెంట్ సభ్యుని సహాయంతో పోర్ట్, పిషింగ్ కు సంబందించిన ఒక విదేశి కంపెనీని స్థాపించే కుట్ర జరిగింది. పర్యావరణానికి నష్టం ఏర్పడుతుంది అని , సముద్ర జలాలు తీవ్రం గా కలుషితమయ్యి ప్రజల ఆరోగ్యాలకు పెను ప్రమాదం ఏర్పడుతుందని ఆనాడు కాకినాడ ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించి ఆ కుట్రను భగ్నం చేసారు. సముద్ర జలాలకు ఆనుకుని పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వటం ప్రమాదం అని జగన్ సర్కార్ కు తెలియనిది కాదు.ఖచ్చితంగా ఇండ్ల స్థలాలు వెనుక పెద్ద కుట్రే దాగివుంది. ఇంత బాహాటంగా అడవులు నరికి వేస్తున్నా అటవి శాఖ, ఇరిగేషన్ శాఖ, కేంద్ర పర్యావరణ శాఖ వారు చోద్యం చున్నవైనం వెనుక ముడుపులు చేతులు మారాయి అనే అనుమానాలు కలుగుతున్నాయి. మడ అడవులు సముద్రం కు ఆనుకుని ఇండ్ల స్థలాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెబుతుంది అంటే బ్రతికి వుండగానే సమాధులు కట్టుకోవటం లాంటి చర్యగా భావించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇండ్ల స్థలాల పేరుతొ పెద్ద ఎత్తున అధికారికంగా భూ సేకరణ ప్రభుత్వం చేస్తుందని, ప్రభుత్వానికి చిత్త శుద్ధి వుంటే చట్ట ప్రకారం కన్నా అధికంగా భూమి వున్న వారి నుండి నిజాయితీగా భూ సేకరణ జరిపి పేదలకు ఇండ్ల నిర్మాణం జరపాలి. జగన్ సర్కార్ కు న్యాయస్థానాలు అన్నా, చట్టాలు అన్నా, చట్ట పరమైన పాలన అన్నా కనీస భాద్యత, గౌరవం లేదు అని , కరోనా వైరస్ నియంత్రణ పై పాలనా పరమైన రక్షణ చర్యలకన్నా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవటం ఏపి ప్రజల దురదృష్టం. మడ అడవులును కేంద్ర ప్రభుత్వం కాపాడాలని, పర్యాటకంగా అభివృద్ధి పరచాలని, సంభందిత యంత్రాంగం భవిష్యత్ విపత్తు ప్రమాదాన్ని తెలియచేస్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలను సమర్పించాలని, నిర్లక్ష్యం వహిస్తే కాకినాడ పరిసర ప్రాంతాలకు ప్రమాదం తప్పదు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు కాకినాడ కు పొంచి వున్న ప్రమాదాన్ని గుర్తించి పేదలకు ఇండ్ల నిర్మాణం పేరుతొ జరుగుతున్న కుట్రను అడ్డుకోవాలి. అందుకు రాజకీయ కార్యాచరణకు సిద్ద పడాలని,కాకినాడ ప్రజలు నిర్లక్ష్య ధోరణి వహిస్తే జరిగే ప్రమాధం కరోనా కంటే తీవ్రంగా వుంటుంది.

విజేశ్వరం బెరేజ్ దిగువన కృష్ణ జింకలు

జనావాసాల మధ్యకు జింకలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ అమలు చేయడంతో వన్యప్రాణుల జనావాసాల మధ్యకు వస్తున్నాయి.ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజి దిగువన లంకల్లో ఇసుక తిన్నెల మధ్య మొలిచే చెంగలిదుబ్బిల చిగుళ్ళు తింటూ చెంగు చెంగున గెంతులేసుకుంటూ తిరిగే కృష్ణ జింకలు బయటకు వస్తున్నాయి. ఈ లంకల్లో వందలాది జింకలు ఉన్నాయి. అయితే ఇవి జనాలకు చిక్కకుండా గోదావరి పాయ మధ్యలోనే జీవనం సాగిస్తాయి. కాని జనతాకిడి తగ్గిపోవటంతో బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.శనివారం కడియం మండలం బుర్రిలంక సమీపంలో మూడేళ్ల జింక బయటకు రావడంతో కుక్కలు దాడి చేశాయి.ఇది గమనించిన ఓ రైతు ఆ జింకను కాపాడి కడియం పశువుల ఆసుపత్రికి తీసుకొచ్చారు.డాక్టర్ కల్లూరి సత్యనారాయణ ఆ జింకకు వైద్యం చేయడంతో క్షేమంగా ఉంది.దానిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఇటీవలి ఈ లంకల్లో జింకల సంఖ్య విపరీతంగా పెరగడంతో కొందరు బోట్లుపై లంకల్లోకి విహార యాత్ర పేరుతో వెళ్ళి వాటిని వేటాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఈ జింకల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు.. కొండ్రెడ్డి శ్రీనివాస్. ప్రెస్ రిపోర్టర్.

తాజా వార్తలు
పెరుగుతున్న కరోనా జరా జాగ్రత్త

కరోనా వైరస్..సుమారు 200 ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుందీ కంటికి కనిపించని శత్రువు. ఇప్పటికి లక్షల మంది కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చావు - బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో ఇప్పటి వరకూ 15464 కరోనా కేసులు నమోదవ్వగా 640 మంది మరణించారు. తెలంగాణలోనే 1033 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1300 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా కరోనా కేసులు రోజురోజుకీ ఎక్కువవుతుండటంతోనే మనదేశానికి ఇటలీకి పట్టిన గతి పట్టకుండా ఉండాలంటే..కొద్దిరోజులు కోట్లాదిమంది ప్రజలు ఇళ్లకి పరిమితమవ్వక తప్పదు. కరోనా బారీనుంచి దేశ ప్రజలను రక్షించేందుకే ఈనెల 25వ తేదీ నుంచి అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం.మరోవైపు దక్షిణమధ్య రైల్వే కూడా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. చాలా వరకూ ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపివేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై తో సహా అన్ని ప్రధాన నగరాలు లాక్ డౌన్ అయ్యాయి. అయినా కరోనా కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భారత్ లో కరోనా 3 స్టేజ్ కి వచ్చే ప్రమాదముందంటున్నారు నిపుణులు. అదే జరిగితే..భారత్ లో ప్రమాద ఘంటికలు మోగినట్లే. ఇప్పటికైనా ప్రజలు కనీస బాధ్యతతో సెల్ఫ్ క్వారంటైన్ అవ్వకపోతే..మన దేశంలో సంభవించే మృత్యువులను ఆపడం ఎవ్వరితరం కాదంటున్నారు. కరోనా మూడో స్టేజ్ కి వస్తే..అది క్రమంగా నాల్గవ స్టేజ్ కి కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే మాత్రం దేశంలో జరిగే కోట్లాది మరణాలకు బాధ్యత ప్రజలే వహించాల్సి వస్తుందన్నారు. రెండో దశలోనే కరోనాను కట్టడి చేయకపోతే దేశంలో 20 కోట్ల కు పైగా మరణాలు తధ్యం అని చెప్తున్నారు. ఇటలీ కన్నామనదేశ జనాభా 20 రెట్లు కన్నా ఎక్కువే. అక్కడే కరోనా మరణాలు సోమవారానికి 13000కు చేరువయ్యాయంటే..మనదేశంలో కరోనా విజృంభిస్తే ఏ స్థాయిలో కరోనా మరణాలు సంభవిస్తాయో ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. అంతస్థాయిలో మరణాలు సంభవించకుండా ఉండాలన్నా..మనందరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా అంతా మనచేతిలోనే ఉంది. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం. వీలైనంత వరకూ ఇళ్లకే పరిమితమవుదాం. కష్టకాలంలో ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు. పండుగలు, పబ్బాలంటూ ఊర్లు వెళ్లకపోయినా పర్లేదు. పెళ్ళిళ్లుంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఈ ఒక్కసారి పండుగ లేదనుకుంటే జీవితంలో ఎన్నో పండుగలు జరుపుకోవచ్చు. లేదు పండుగే ముఖ్యం అనుకుంటే జీవితంలో ఇప్పుడొచ్చే ఉగాదే ఆఖరి పండుగ అవ్వొచ్చు..ఎవరు చెప్పినా..ఏం చెప్పినా అంతా మీ మంచికే. బాధ్యత గల పౌరులుగా మెలగండి. ఇంట్లో ఉండి దేశానికి సేవ చేద్దాం. కరోనా బారీ నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు దేశాన్ని రక్షిద్దాం.

పంగిడి లోభూకుంభకోణం

ఐ.పంగిడి, దేచర్ల గ్రామంలో 70 లక్షల రూపాయల భూకుంభకోణం.............. ఐ.పంగిడి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం 9 ఎకరాల భూమిని ;దేచర్ల గ్రామంలో 1 1/2 ఎకరాల భూమిని ప్రభుత్వం వారు కొనుగోలు చేయడం జరిగింది .ఇళ్ల స్థలాలకోసం భూమి ఇచ్చిన రైతులకు ఎకరానికి 33 లక్షల నుండి 35 లక్షలు చొప్పున వారివారి అకౌంట్లలో ప్రభుత్వం వారు జమ చేశారు .ఐపంగిడి గ్రామంలో వైఎస్సార్ పార్టీ నాయకులు రైతులను బెదిరించి ,ప్రభుత్వం వారు ఎకరానికి 29 లక్షలు మాత్రమే రేటు నిర్ణయిస్తే మినిస్టర్ గారితో మాట్లాడి ఆ రేటును మేము 35 లక్షల వరకు పెరిగేలా కృషి చేశామని అందువలన ఆ 29 లక్షల రూపాయలు పోను.... మిగతా ఆరు లక్షలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు .బ్యాంక్ విత్ డ్రా ఫారాలపై సంతకాలు చేయించుకుంటున్నారు .దేచర్ల గ్రామంలో ఒక ఎకరాకు 24 లక్షలు చొప్పున ధర ప్రభుత్వం నిర్ణయించిందని, దానిని 35 లక్షల వరకూ మినిస్టర్ గారి ద్వారా పెరిగేలా కృషి చేశామని ,అందువలన ఎకరానికి 11 లక్షల చొప్పున తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు రైతులు మొరపెట్టుకుంటున్నారు .ఐ.పంగిడి గ్రామంలో 9 ఎకరాలకు ఎకరా ఒక్కింటికి 6 లక్షల చొప్పున 54 లక్షలు ,దేచర్ల గ్రామం లో ఒకటిన్నర ఎకరాలకి ఎకరా ఒక్కింటికి 11 లక్షల చొప్పున 16 లక్షల 50 వేల రూపాయలు మొత్తం కలిపి రైతుల వద్ద నుండి పంగిడి వైసిపి వ్యక్తులు 70 లక్షల 50 వేల రూపాయలు కొట్టేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు .ఆ సొమ్మును మినిస్టర్ గారికి, రెవిన్యూ డిపార్ట్మెంట్ వారికి చెల్లించాలని వెంటనే సదరు సొమ్మును ఇవ్వాలని, లేకుంటే మీ అంతు చూస్తామని బెదిరిస్తున్నట్టుగా భూములిచ్చిన రైతులు వాపోతున్నారు . " నిజం నిప్పులాంటిది".... వాస్తవాలు ఎప్పటికైనా బయటపడతాయి. వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఆ పార్టీని అడ్డంపెట్టుకుని లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్న చీడపురుగులను ఏరిపారేయకపోతే వై.యస్.ఆర్ పార్టీ దెబ్బ తింటుంది. మినిస్టర్ గారికి, డిపార్ట్మెంట్ వారికి చెడ్డ పేరు వస్తుంది .వైయస్.ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,శ్రేయోభిలాషులు ఈ విషయం పై దృష్టి పెట్టి పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలని మనవి చేస్తున్నాము.భూములు ఇచ్చిన రైతులెవరూ పంగిడి వైసిపివ్యక్తుల బెదిరింపులకు లొంగవద్దు. వారికి ఒక్క పైసాకూడా ఇవ్వవద్దు..మీకు గ్రామపెద్దలు, జనసేన,బిజెపి నాయకులు అండగా ఉంటామని వాగ్దానం ...

గోదావరి హారతి పోస్టర్ విడుదల చేసిన మంత్రి వనిత

కొవ్వూరు న్యూస్ : గోదావరి హారతి కి సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర మంత్రి తానేటి వనిత విడుదల చేశారు

బిజినెస్
జన్‌ధన్ ఖాతాలు ఇపుడు ఆర్థిక నేరగాళ్ళకు అడ్డా

దేశంలో సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తేవాలన్న బృహత్ సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకం జన్‌ధన్ స్కీమ్. అతి తక్కువ కాలంలో పది కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగింది. ఇది ఓ రికార్డుగా మారింది. అయితే, ఈ జన్‌ధన్ ఖాతాలు ఇపుడు ఆర్థిక నేరగాళ్ళకు అడ్డాగా మారింది. ఇదే విషయంపై భారత రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా స్పందిస్తూ జన్‌ధన్‌ ఖాతాలు ఆర్థిక నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు కేంద్రం కానున్నాయని, ఇలాంటి ఖాతాలను ఆర్థిక నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందువల్ల వాటిపై నిరంతరం పర్యవేక్షించే ఒక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాంకుల్లో నిరుపయోగంగా పడి ఉన్న ఖాతాల ద్వారా ఖాతాదారుకు తెలియకుండానే భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్టు ఇటీవల బయటకు వచ్చిన కేసును ఆయన ఉదహరించారు. అది పంజాబ్‌లోని ఒక రోజుకూలీ ఖాతా అని, బేసిక్‌ ఖాతాగా ప్రారంభించిన దానిలో లావాదేవీలపై కూడా పరిమితి ఉన్నప్పటికీ కోటి రూపాయల లావాదేవీ జరిగిందని వివరించారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆ కూలీకి నోటీసు పంపగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. బ్యాంకు ఖాతా ప్రారంభించే సమయంలో కెవైసి నిబంధనలు తుచ తప్పకుండా పాటించినా తదుపరి నిఘాలో మాత్రం బ్యాంకులు విఫలమయ్యాయనేందుకు ఇది సంకేతమన్నారు. బ్యాంకుల అంతర్గత నిఘా వ్యవస్థ కాలం చెల్లిపోయింది కావడం వల్ల ఇలాంటి దుర్వినియోగాన్ని గుర్తు పట్టలేకపోయిందని వ్యాఖ్యానించారు.

భారత దేశంలో రిలయన్స్ నెంబర్ 1

భారత దేశంలో రిలయన్స్ నెంబర్ 1

రాజకీయాలు
మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ *12గంటలు నిరాహారదీక్ష

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కొవ్వూరు పట్టణం నందు గల మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ *12గంటలు నిరాహారదీక్ష లో పాల్గొంటారు  .  కావున పార్టీ శ్రేణులు ప్రజలు అందరూ కూడా ప్రభుత్వం నిర్దేశించిన  lack down నిబంధనలు పాటించే ఎవరికి వారు వారి స్వగృహం నందు   ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పట్టణం నందు high risk redjone   లో  తన నివాసానికి రావొద్దని   వారు పత్రికాముఖంగా తెలియజేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఇబ్బంది పడుచున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి.ధాన్యం , మిర్చి, అరటి పండ్లతోటల రైతులను ఆదుకోవాలని జవహర్ తెలిపారు.కరోనా నియంత్రణ కోసం పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, అధికారులు, పాత్రికేయులకు రక్షణ కిట్లు దించాలని,అన్న క్యాంటీన్లను వెంటనే తెరచి పేద వాడి ఆకలిని తీర్చాలని మేము దీక్ష చేస్తున్నామని   జవహర్ తెలిపారు.  ఉదయం 9 గంటల నుండి  సాయంత్రం 9 గంటల వరకు పేదలను రైతులను ను ప్రభుత్వం ఆదుకోవాలని మన మాజీ మినిస్టర్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారు 12 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారని తెలియజేస్తున్నాము . కరోనా వైరస్ కారణంగా కొవ్వూరు రెడ్ జోన్గా ఉన్నందువల్ల ఈ నిరాహార దీక్షకు మద్దతుగా తెలుగుదేశ పార్టీ శ్రేణులు ఎవరూ కూడా హాజరు కాకూడదని జవహర్ తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ పౌరుడి ఆవేదన

హద్దు అదుపు లేని రధులు

టీడీపీ కి వంశీ గుడ్ బై

టీడీపీకి ఆ పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుడ్ బై చెప్పారు ఈ మేరకు వంశీ తన రాజీనామా లేఖను టిడిపి అధినేత చంద్రబాబు కి పంపారు తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు టీడీపీని వీడి వైసీపీ లో చేరతారని ప్రచారం జరగగా. ఏకంగా రాజకీయాల్లో నుండి వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మంచిమాట
చుండ్రు నివారణకు హెన్నా

హెన్న(గోరింటాకు) చుండ్రును సమర్ధవంతంగా తొలగించగలదు. ఇది యాంటీ బ్యాక్టీరియా కండీషనర్ గా కూడా పని చేస్తుంది. హెన్న తీసుకుని దానిలో కొన్ని చుక్కలు నిమ్మ రసాన్ని అలాగే ఆలివ్ ఆయిల్ ను కలిపి తలకు పట్టించుకోవాలి. ఒక గంట పాటు ఉంచుకుకున్న తర్వాత తలస్నానం చేయాలి. ఇది చుండ్రును తొలగించటంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.

నేటి మంచి మాట

భలహీనులే  ప్రతీకారంతో ఆపదలను కొనితెచ్చుకుంటాడు.భలవంతులు మౌనంగా సహిస్తారు. బుదిమంతులు మాత్రమె జరిగిన సంఘటన మరచిపోయి ప్రశాంతంగా జీవిస్తారు .

తల్లి కంటే గొప్పది గోమాత

'కోడి,మేక,లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి'' అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా..... గోవు కూడా జంతువే కానీ.... ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది. అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ''గోమాత'' అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు. నీ చదువు... నీ సంస్కారం... నీ విచక్షణ... నీ విజ్ఞత... నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే... గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా * ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని .. ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు. అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు...ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు. ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి. మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు? గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత. మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది. * ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు(Oxygen )ను వదిలే ఏకైక ప్రాణి. * విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది. * వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది. * ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి. * కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది. * గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని. * గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు. * ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు. * ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. * ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen )ఉత్పత్తి అవుతుంది. * గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది. ''గోరక్షణ వల్లనే మన జాతి,మన ధర్మము రక్షింపబడును.గోరక్షణ స్ గోవు గరళాన్ని మింగి అమృత దారాలు ఇస్తుంది . ఇది ఒక్క గోవుకే సాధ్యం. గో మంసమే తింటానంటావా 9 ఏకదాటిగా గో మాంసం తిని ఏ రోగం బారిన పడకుండా  రోడ్ ఫై తిరిగితే నీవు గోవు కంటే గొప్ప వాడివి 

కధలు
"మరణం మనల్ని దూరం చేసేవరకు... నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను ."

భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా చెప్పాడు... . భర్త - నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తన తో అసలు విషయం చెప్పాడు. . భార్య - (ఆ మాటలకి బదులుగా ఆమె ) ఎందుకు అని మాములుగా అడిగింది? . భర్త - ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏం ఇవ్వలేదు.. . భార్య - (ఆమెకి కోపం వచ్చింది.) ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది.. . ఆ రాత్రి, వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్త ని గట్టిగా అడిగింది..భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు. . భర్త - నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపైన ప్రేమ లేదు.. . భార్య - ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది.. ఒక నిమిషం ఏం అవుతుందో తనకేం అర్థం కాలేదు.. . భర్త - గిల్టీ ఫీలింగ్ తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు వొప్పుకునేందుకు , నువ్వు ఉండడానికి సొంత ఇల్లు , కారు అండ్ నా సంస్థ లో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు.. . భార్య - చాలా కోపం తో ఆ పేపర్లు ని చింపేసింది.. ప్రేమ ని ఎప్పటికి కొనలేరు అని గట్టిగా ఏడిచేసింది.. . భర్త గా తన లైఫ్ లో ఒక తెలియని వ్యక్తి లా ఆమె జీవితంలో పది సంవత్సరాలు వున్నాడు. అతని భార్య సమయం వృధా చేసానని బాధ పడుతున్నాడు. అతను తన భార్య ని అర్థం చేస్కునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యలేదు.కానీ అతను జాను ని మాత్రమే ప్రేమిస్తున్నాడు.. ఏడుస్తున్న తన భార్య ని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది.. . మరుసటి రోజు, అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తు కనిపించింది. అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఏందుకుంటే ఆ రోజంతా అతని లవర్ జానూ తో కలిసి రోజంతా తిరగటం వల్ల, బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్య ని పట్టించుకోకుండా, పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు. . ఉదయం, ఆమె విడాకులకు సంబధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమి కోరుకోవటంలేదు, కానీ విడాకులు ముందు ఒక నెల రోజుల పాటు అతను తన తో వుండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది. . ఆమె కారణాలు చాలా సాధారణం గా ఉన్నాయి. వాళ్ళ కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు వున్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను, వాళ్ళ భర్త ని నెల రోజులు గడువు అడిగింది. . నాకు అంగీకరమే అని వాళ్ళ భర్త ఆమె తో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది, మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఏలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజు ఉదయం ఆమె ని ఎత్తుకుని వాళ్ళ బెడ్ రూమ్ నుండి హల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది. అప్పుడు అతడు ఆమె కి మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసివుండే చివరి రోజులలో, తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. . అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతులు గురించి అతని లవర్ జానూ కి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు కి అర్ధంలేనట్లుగా అతను భావించాడు. నీ భార్య, నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలాడుతుంది అని జాను అతని తో అంది.. . విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి , అతని భార్యకు ఏలాంటి శారీరక సంబంధం లేదు. . మొదటి రోజున తాను తన భార్యను ఎత్త్తుకున్నప్పుడు, అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది. "హేయ్..! నాన్న, అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లుకొట్టాడు". ఆ అబ్బాయి మాటలు అతనికి కు బాధను కలిగించాయి. అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తన తో ఇలా చెప్పింది. "మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా, నవ్వాడు.. అతను ఆఫీస్ కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరకి వచ్చింది... ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురుచూస్తుంది. తాను ఆఫీసుకు ఒక్కడే , ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. . . రెండవ రోజు న , వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది..ఆమె తల తన గుండె ని తాకుతుంది..ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది.. తాను కొంత కాలంగా తన భార్య ని గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడుతలు కనిపిస్తున్నాయి, ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్త ని భార్య అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తు తాను ఆశ్చర్యపోయాడు.. . నాలుగో రోజు, తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అంమ్మాయ్ తోనేనా నేను పది సంవత్సరాల జీవించిదని అతనికి అనిపించింది. . ఐదవ మరియు ఆరవ రోజున, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జాను కి చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళటం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు. . ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్ లు ట్రై చేసింది కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూస్ గానే ఉంది.. అప్పుడు అతనికి అర్థం అయ్యింది తను చాలా సన్నగా అయ్యింది అని.. అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని.. ఆ విషయం అతనికి బలం గా తగిలింది.. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థం అయ్యింది.. అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తల ని తాకింది... ఆ సమయం లోనే వాళ్ళ అబ్బాయ్ వచ్చాడు.. . ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్న తో ఇలా అన్నాడు.."నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది.." అని అన్నాడు.. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయిజీవితంలో విలువైన, అపురూపమైన సంఘటన.. . అతని భార్య, వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది, వాడు వాళ్ళ అమ్మ దగ్గరకి వచ్చాడు.. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయ్ ని గట్టిగా హత్తుకుంది.వాళ్ ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు. . రోజులానే అతను ఆమె ని ఎత్తుకుని బెడ్ రూం నుండి హల్ కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమ గా, సహజం గా వేసింది.. అతను ఆమె ని గట్టిగా పట్టుకున్నాడు అచ్ఛం వాళ్ళ పెళ్లి రోజులాగా, కానీ ఆమె చాలా తేలికగా వుండటం వలన అతనికి చాలా బాధ గా అనిపించిది. . చివరి రోజున, అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూలుకి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు, "మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి" అని చెప్పాడు.. . తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కారు నుండి వేగం గా దిగి, డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యేకొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపొతుందెమో అని. . అతను జాను వుండే క్యాబిన్ కి వెళ్ళాడు.. సారి చెప్పి , అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు. ఆమె(జాను) అతని వైపు ఆశ్చర్యంగా చూసి, తన నుదిటిపై చేయి వేసింది. నువ్వు బాగానే వున్నావ్ కదా? అని అడిగింది. అతను తన నుదిటి మీద వున్న ఆమె చేతిని తీసి, సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు. మా వివాహా జీవితం నాకు విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు,తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియలేదు. మేము ఎప్పుడు ప్రేమ గా మాట్లాడనుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు..ఎప్పుడయితే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థం అయ్యింది తను చనిపోయే దాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్ఛం మా పెళ్లిరోజు లానే.... . జాను హఠాత్తుగా లేచి, అతనిని ఒక చెంప దెబ్బ కొట్టింది. ఏడుస్తు తన ని బయటకి పంపి తలుపు వేసింది. ఇంక అతను ఇంటికి వెళ్తూ దారి లో పూల దుకాణం వద్ద, తన భార్య కోసం ప్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు. . కార్డ్ మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది . . అప్పుడు అతను నవ్వుతూ "మరణం మనల్ని దూరం చేసేవరకు... నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను ." అని రాయమని చెప్పాడు.. . ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఏక్కి పైకి వెళ్ళాడు .తన భార్యను మంచం మీద చూసాడు.. . . అప్పటికే ఆమె చనిపోయింది. . ఒక్కసారి అతని కి ఏం అర్థం కాలేదు.. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్.. . తన భార్య కొన్ని నెలలగా క్యాన్సర్ తో పోరాడుతుంది. తాను జాను తో బిజీగా వుండటం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంతవరకు వాళ్ళ కొడుకుకు దూరంగా వుంచి, తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా వుండాలి అనుకుంది. . మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్ధం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకు లో డబ్బు ఇవేమి బంధానికి సంబధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు. . మీ జీవిత భాగస్వామితో వీలునైంతవరకు సమయం కేటాయిస్తూ, ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ వుంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన, సంతోషకరమైన వివాహం బంధం నిలబడుతుంది. . మనం ఏం చేసినా , ఎంత ప్రేమ గా చూసుకున్న అని వాళ్ళు వున్నప్పుడే చూసుకోవాలి.. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమ చూసుకుందాం అన్న వాళ్ళు మనతో వుండరు.. . చాలా మంది కేవలం అపార్ధాల వల్ల విడిపోతున్నారు, ఇది చదివి కొంతమందైనా తాము చేసే తప్పును తెలుసుకుని, తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను.

ఎవరి శక్తి వారిది - ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు

అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది. కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది.సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది.“నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి.కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరికి తీసేసింది. చాలా సేపు కష్ట పడింది. చివరికి వలలో పెద్ద చిల్లు తయ్యారయ్యింది.సింహం వలలోంచి బయట పడింది. ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపాలనుకునే సమయానికి ఎలుక పారి పోయింది. “చిన్న ఎలుక నాకు యెమి పనికివస్తుంది అనుకున్నాను – ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది. నేను యే జంతువునీ తక్కువగా అంచనా వేయకోడదు!” అనుకుని తన దారిని వెళ్ళింది.

పరోపకారం అన్నింటికన్నా మించిన ధర్మం- అది రైతుకే సాధ్యం

ఓ రాజుకు నలుగురు కొడుకులుండేవారు. "ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముణ్ణి వెతికి తీసుకువస్తాడో అతడికే రాజ్యాధికారం ఇస్తాను" అన్నాడు ఆ రాజు తన కొడుకులతో. రాకుమారులు నలుగురూ తమ గుఱ్ఱాలు తీసుకుని నాలుగు దిక్కులకూ బయలుదేరారు.కొన్నాళ్ల తర్వాత పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఓ వ్యాపారిని నిలబెట్టి, "ఈ శేఠ్ గారు వేలాది రూపాయలు దానం చేస్తుంటారు. ఎన్నో గుళ్లూ గోపురాలు కట్టించారు. చెరువులు తవ్వించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. తీర్థక్షేత్రాలలో ఎన్నో వ్రతాలు చేస్తుంటారు. నిత్యం పురాణ శ్రవణం చేస్తుంటారు. గోపూజలు చేస్తుంటారు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడెవరూ ఉండరు." అన్నాడు. ఈయన నిశ్చయంగా ధర్మాత్ముడే అని పలికిన రాజు, ఆ వ్యాపారిని సత్కరించి పంపివేశాడు.  రెండవ కొడుకు ఓ బక్కచిక్కిన బ్రాహ్మణుడిని తీసుకువచ్చి " ప్రభూ!  ఈ బ్రాహ్మణుడు నాలుగూ ధామాలకు, సప్తపురాలకు కాలినడకన వెళ్లి యాత్రలు చేసివచ్చాడు. సదా వీరు చాంద్రాయణ ప్రతం చేస్తుంటారు. అసత్యానికి వీరు భయపడతారు. ఈయన కోపగించడం ఎవరూ, ఎన్నడూ చూడలేదు. నియమబద్దంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తరువాతే జలపానం చేస్తారు. త్రికాలాల్లోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తారు. ఈ కాలంలో యీ విశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ట ధర్మాత్ములెవరూ లేరు." అన్నాడు. రాజు బ్రాహ్మణ దేవతకు నమస్కరించి అధిక దక్షిణలిచ్చి, వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశాడు.  మూడవ కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొని వచ్చాడు. ఆ బాబాజీ వస్తూనే ఆసనం వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చుండి పోయారు. జీర్ణమైన బట్టలతో అస్థిపంజరంలా ఉన్న ఆకారంతో ఆయన కనిపిస్తున్నాడు. అందరూ ఆసీనులైన తరువాత మూడవ కొడుకూ  " ప్రభూ! వీరు ఎంతగానో నేను ప్రార్థించగా ఇక్కడకు విచ్చేశారు. వీరు మహా తపస్వులు. వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తారు. గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్యంలో ఉంటారు. శీతకాలంలో జలాలలో నిలబడుతారు. సదా భగవంతుని ధ్యానంలో వుండే వీరికి మించిన మహా ధర్మాత్ములు హభించడం దుర్లభమే..." అన్నాడు. రాజు ఆ మహాత్మునికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీస్సులు అందుకుని వీడ్కోలు పలికాడు.. ఆపై వీరు ధర్మాత్ములే అన్నాడు అందరి తరువాత చిన్నకొడుకు వచ్చాడు. అతనితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెలో నివసించే ఓ రైతు ఉన్నాడు. దూరం నుండియే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. అన్నలు ముగ్గురూ తమ్ముని మూర్ఖత్వానికి పకపక నవ్వారు. అప్పుడా చిన్నకొడుకు " ప్రభూ! ఓ కుక్కకు గాయం అయ్యింది. ఇతను అది చూసి దాని గాయం కడిగాడు. అందుకే నేనితణ్ణి తీసుకువచ్చాను. ఇతడూ ధర్మాత్ముడవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి" అన్నాడు.  రాజు " ఏమయ్యా! నువ్వు ఏం ధర్మం చేస్తుంటావు?" భయపడుతూనే రైతు పలికాడు -" ప్రభూ! నేను చదువుకున్నవాణ్ణి కాను. నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది... ఎవరైనా జబ్బుపడితే సేవ చేస్తాను. ఎవరైనా యాచిస్తే గుప్పెడు మెతుకులు పెడతాను..."            అంతట రాజు, "ఇతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు" అన్నాడు. అది విని కొడుకులందరూ అటూ ఇటూ చూడసాగారు.. రాజు అప్పుడు, "దాన ధర్మాలు చేయడం, గోపూజ చేయడం, అసత్యమాడక పోవడం క్రోధంగా ఉండక పోవడం, తీర్థయాత్రలు, సంధ్యావందనం పూజాదులు కొనసాగించడం కూడా ధర్మమే. తపస్సు చేయడం ఆవశ్యకమైన ధర్మమే . కానీ సర్వాధిక ధర్మమేమంటే అర్థించక పోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం, రోగికి సేవ చేయడం, కష్టంలో ఉన్న వారికి చేయూతనీయడం సర్వాధికమైన ధర్మం. పరులకు సహకరించే వారికి తనంతతానుగా సహాయం అందుతుంది. త్రిలోక నాథుడైన పరమాత్మ అట్టి పరోపకార పరాయణునిపై ప్రసన్నుడై ఉంటాడు" అని పలికెను. అందుకే పరోపకారం అన్నింటికన్నా మించిన ధర్మం. అది నిర్వర్తించే వాడే ధర్మాత్ముడు.